కొన్నినెలల క్రితం 'కౌసల్య కృష్ణమూర్తి'గా వచ్చింది హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. తొలి సినిమాతోనే తెలుగులో పేరు తెచ్చుకుంది. ఇప్పుడు రెజ్లర్‌గా కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ పాత్రలో ఐశ్వర్య నటిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. ట్రైలర్‌ను బుధవారం.. దర్శకుడు సురేందర్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఇందులోని.. 'ఇద్దరు గొడవపడితే ఒకడు గెలుస్తాడు. అదే కాంప్రమైజ్ అయ్యారనుకో ఇద్దరూ గెలుస్తారు', 'ఆటకు, గొడవకు తేడా తెలియని మనుషులు.. ఎంత తెలుసుకుంటే ఏం లాభం' అనే డైలాగ్‌లు అలరిస్తున్నాయి.