బొలీవియాకు చెందిన జాయ్సే ప్రాడో.. 2018లో 22 ఏళ్ల ప్రాయంలోనే మిస్ బొలీవియా కిరీటాన్ని దక్కించుకుంది. కానీ కాంటెస్ట్ నిబంధనలు అతిక్రమించిందన్న కారణంతో ఆమెకు ఇచ్చిన కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు నిర్వాహకులు.
- కిరీటం దక్కించుకోవాలంటే అందంతో పాటు గుణం, ధైర్యం, ఔదార్యం వంటి లక్షణాలను పరిశీలిస్తారు. జాయ్సే ప్రాడో అలాంటి ఎన్నో పరీక్షలు ఎదుర్కొని గతేడాది మిస్ యూనివర్స్ బొలీవియా కిరీటం దక్కించుకుంది. అయితే టైటిల్ అందుకున్న సమయంలో నాలుగు నెలల గర్భవతి అనే విషయాన్ని వెల్లడించలేదు. ఆ కారణమే ఆమెకు దక్కిన గౌరవాన్ని పోగొట్టుకునేలా చేసింది.
కిరీటం తీసుకోవడంపై విమర్శలు
కాంటెస్ట్ నిబంధనల ప్రకారం ఇందులో పాల్గొనే యువతులకు పెళ్లికాకూడదు, గర్భం దాల్చి ఉండకూడదు. అయితే ఇటీవలే జాయ్సే ప్రాడో గర్భవతి అన్న విషయం తెలుసుకున్న నిర్వాహకులు ఆమెకిచ్చిన కిరీటాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
సామాజిక మాధ్యమం బయటపెట్టింది...
యువతకు ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలన్న తపన ఎక్కువైపోతోంది. ఇలాంటి ఉత్సాహంతోనే గర్భవతిగా ఉన్నానంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది జాయ్సే. ఈ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన ప్రాడో ఏడాది పాటు అవివాహితగా, పిల్లలు కనకుండా ఉండాలని కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కాని జాయ్సే గర్భవతి అని తెలుసుకున్న నిర్వహకులు కాంట్రాక్టు నిబంధనలు అతిక్రమణ కింద కిరీటాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ప్రియుడు రోడ్రిగో గిమ్నెజ్తో జాయ్సే ప్రాడో ఈ ఘటనపై నెటిజన్లు, అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పటినుంచో ఉన్న పాత పద్ధతులు మార్చాలని కోరుతున్నారు. అందానికి కిరీటమిచ్చారు.. అమ్మతనానికి విలువివ్వకుండా కిరీటం లాక్కుంటున్నారు ఇదేం కాంటెస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాంటెస్ట్ నిబంధనలు మార్చాలని అభిమానుల మండిపాటు