తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మీర్జాపుర్'​ నటుడు అనుమానాస్పద మృతి - బాలీవుడ్​ నటుడు మృతి

Mirzapur Lalit: మీర్జాపుర్​ వెబ్​సిరీస్​లో లలిత్​ పాత్ర పోషించిన బ్రహ్మమిశ్ర మృతిచెందారు. గురువారం ఆయన నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మిశ్ర మృతిపట్ల తోటి నటులు సంతాపం వ్యక్తం చేశారు.

Mirzapur Lalit
'మీర్జాపుర్'​ నటుడు మృతి- సినీ నటుల సంతాపం

By

Published : Dec 2, 2021, 8:53 PM IST

Mirzapur Lalit: 'మీర్జాపుర్​' నటుడు బ్రహ్మ మిశ్ర గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తోటి నటుడు దివ్యేందు వెల్లడించారు. సోషల్​ మీడియాలో మిశ్ర ఫొటోను షేర్​ చేసి సంతాపం వ్యక్తం చేశారు. దీనిపై మీర్జాపుర్​లో మిశ్రాతో కలిసి పనిచేసిన ఇతర నటులు కూడా సంతాపం తెలిపారు.

మిశ్ర మృతిపై మిర్జాపుర్​ నిర్మించిన సంస్థ ఎక్సెల్​మూవీస్​ ఇన్​స్టా వేదికగా స్పందించింది. మిశ్ర మృతి పట్ల తాము సంతాపం వ్యక్తం చేస్తున్నామని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నామని పేర్కొంది.

గురువారం మధ్యాహ్నం ముంబయి వెర్సోవాలోని మిశ్ర నివాసంలో అనుమానాస్పద రీతిలో పడి ఉన్న అతని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. సగం కుళ్లిపోయి ఉన్న ఆ మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు తరలించారు.

'మిర్జాపుర్​'లో మున్నాభయ్యాగా దివ్యేందు నటిస్తే, అతని సహాయకుడైన లలిత్​ పాత్రలో మిశ్ర కనిపించారు. 'కేశరీ', 'బద్రీనాథ్​ కీ దుల్హానియా', 'హవాయిజాదా', 'దంగా' వంటి చిత్రాల్లో మిశ్ర నటించినా.. మిర్జాపుర్​ వెబ్​సిరీస్​తోనే అతనికి మంచి గుర్తింపు లభించింది.

ఇదీ చూడండి :ఒమిక్రాన్ భయం.. సంక్రాంతికి సినిమాలు రిలీజ్​ కష్టమేనా?

ABOUT THE AUTHOR

...view details