ఆచార్యతో మంత్రి అజయ్ 'చిరు' హాసం - megastar chiranjeevi latest news
ఆచార్య సినిమా సెట్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భారీ సెట్‌లో జరుగుతున్న షూటింగ్ లొకేషన్‌కు వెళ్లిన మంత్రి... మెగాస్టార్ చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివతో కాసేపు సరదాగా ముచ్చటించారు. చిత్రబృందానికి, మెగాస్టార్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తూ... మంత్రి ట్వీట్ చేశారు. చిరూతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఆచార్య చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంతకీ మెగాస్టార్‌ని మంత్రి ఎందుకు కలిశారన్న విషయంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.
![ఆచార్యతో మంత్రి అజయ్ 'చిరు' హాసం minister puvvada ajay kumar met megastar chiranjeevi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10434021-19-10434021-1611992145007.jpg)
minister puvvada ajay kumar met megastar chiranjeevi