తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎస్పీబీ మృతికి అల్బర్టా రాష్ట్రమంత్రి సంతాపం - ఎస్పీ బాలసుబ్రమణ్యం

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల కెనడాలోని అల్బర్టా రాష్ట్ర మంత్రి శివలింగ ప్రసాద్​ పండా సంతాపాన్ని తెలియజేశారు. బాలు ఎప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.

Minister of Alberta State expressed condolences over the death of SP Balasubramaniam
ఎస్పీబీ మృతికి అల్బర్టా రాష్ట్రమంత్రి సంతాపం

By

Published : Sep 27, 2020, 8:02 AM IST

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతికి చింతిస్తూ పలువురు ప్రముఖులు సోషల్​మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వీరితోపాటు విదేశాల్లో ఉన్న భారతీయులూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఎస్పీ బాలు మృతి పట్ల కెనడాకు చెందిన అల్బర్టా రాష్ట్ర మంత్రి శివలింగ ప్రసాద్​ పండా సంతాపాన్ని ప్రకటించారు. బాలు కుటుంబసభ్యులకు ప్రసాద్​ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంగీత ప్రియుల హృదయాల్లో ఎస్పీబీ చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు.

గుంటూరులోని సంగంజాగర్లమూడిలో జన్మించిన శివలింగ ప్రసాద్​ పండా.. కెనడాలోని అల్బర్టా రాష్ట్ర క్యాబినేట్​లో మంత్రిగా పని చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details