'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు'.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమాల్లో ఈ డైలాగ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ఇందులోని 'మైండ్ బ్లాక్' పదంతో 'సరిలేరు నీకెవ్వరు' కోసం ఏకంగా ఓ పాటనే రూపొందించారు. అందుకు సంబంధించన లిరికల్ గీతాన్ని చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన మాస్ బీట్.. శ్రోతల్ని అలరిస్తూ, చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.
'మైండ్ బ్లాక్' చేస్తున్న సూపర్‌స్టార్ పాట - mahesh babu
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని 'మైండ్ బ్లాక్' అంటూ సాగే లిరికల్ గీతం సోమవారం విడుదలైంది. ఇందులోని మాస్ బీట్ చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.
!['మైండ్ బ్లాక్' చేస్తున్న సూపర్‌స్టార్ పాట 'మైండ్ బ్లాక్' చేస్తున్న సూపర్‌స్టార్ పాట](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5243631-692-5243631-1575285083747.jpg)
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
'సరిలేరు నీకెవ్వరు'లో రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో సూపర్‌స్టార్ నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్‌రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: వేదికపైనే కన్నీరు పెట్టుకున్న హీరోయిన్ అలియా భట్