FIR Movie Poster Issue: ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఎఫ్‌ఐఆర్ తెలుగు సినిమా పోస్టర్ ఉందని ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆరోపించారు. పోస్టర్లో కథానాయకుడు ముఖంపై ముద్రించిన అరబిక్ పదాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఆదర్శ నగర్ ఎమ్మెల్యేల నివాస సముదాయంలోని ఆయన కార్యాలయంలో మంత్రిని.. నాంపల్లి, యాకత్పురా, కార్వాన్ ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మెరాజ్, సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రితో పాటు కౌసర్ మొహినోద్దీన్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించారు.
'మా మనోభావాలు దెబ్బతీసేలా ఆ మూవీ పోస్టర్.. వెంటనే తొలగించండి' - mim mlas met minister talasani srinivas and complained on fir movie
FIR Movie Poster Issue: ముస్లింల మనోభావాలు దెబ్బ తీసేలా ఎఫ్‌ఐఆర్ తెలుగు సినిమా పోస్టర్ ఉందని.. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆరోపించారు. పోస్టర్‌పై అరబిక్ పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఎఫ్‌ఐఆర్ సినిమా వివాదం
స్పందించిన మంత్రి తలసాని... ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబుతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే ఎఫ్‌ఐఆర్ సినిమా ప్రతినిధులతో మాట్లాడి అరబిక్ పదాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి:దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నా: సీఎం కేసీఆర్