తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేయసితో నగ్నంగా పోజులిచ్చిన మిలింద్ సోమన్ - milind soman, madhu sapre latest news

ఆనాటి ప్రముఖ మోడల్ మిలింగ్ సోమన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఓ యాడ్​ షూట్ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. మరోసారి ఆ ఫొటో నెట్టింట హాట్ టాపిక్​గా మారింది.

మిలింద్
మిలింద్

By

Published : May 18, 2020, 7:27 PM IST

ప్రస్తుత ఆధునిక కాలంలో సెలబ్రిటీల ఫొటోలు, ఫొటోషూట్​లు జనాల్లోకి చేరడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. కానీ 25 ఏళ్ల క్రితం ఓ ప్రకటన కోసం చేసిన ఫొటొషూట్​లోని ఫొటో అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అందుకు కారణం ఎవరో కాదు ప్రముఖ మోడల్ మిలింద్ సోమన్. ఆ చిత్రం ద్వారా ఆయన అపుడు ఫేమస్ అయిపోయారు. ఆ ఫొటోలో మిలింద్​ తన మాజీ ప్రేయసి మధు సప్రేతో పాటు నగ్నంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మరోసారి అదే ఫొటోను తన ఇన్​స్టాలో షేర్ చేశారు సోమన్.

"25 ఏళ్ల క్రితం ఫొటో ఇది. ఆ కాలంలో సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ లేవు. ప్రస్తుతం ఈ ఫొటోను విడుదల చేస్తే స్పందన ఎలా ఉంటుందో చూడాలని ఉంది." అంటూ ఫొటోను షేర్ చేశారు మిలింద్. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

మిలింద్ సోమన్ 80, 90 దశకాల్లో ప్రముఖ మోడల్​గా పేరొందారు. మధు సప్రేతో కలిసి ఎన్నో ప్రకటనల్లో నటించారు. కామసూత్ర యాడ్‌లో అర్ధనగ్నంగా నటించి అప్పట్లో సంచలనం రేపారు. 53 ఏళ్ల మిలింద్.. తనకంటే వయసులో 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details