తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఏడాదికి రెండుసార్లే మద్యం సేవిస్తా' - మిలింద్ సోమన్ ఫిట్​నెస్ రహస్యం

తన ఫిట్​నెస్​తో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు మోడల్, నటుడు మిలింద్ సోమన్. తాజాగా తను ఎలాంటి డైట్ పాటిస్తారో చెప్పారు.

Milind Soman
మిలింద్ సోమన్

By

Published : May 24, 2021, 9:29 AM IST

ఫిట్‌నెస్‌ ప్రియులందరికీ ఆయన పేరు సుపరిచితమే. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గానే కాకుండా మోడల్‌, నటుడిగా పేరు తెచ్చుకున్నారు మిలింద్‌ సోమన్‌. శరీరం ఫిట్‌గా ఉంచుకోవడమనేది కేవలం తమలాంటి సెలబ్రిటీలకే పరిమితం కాదని.. అందరూ ఫిట్‌గా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకోవాలని సూచిస్తారాయన. అభిమానులు ఆయన చేసే సూచనలు అదేవిధంగా అనుసరిస్తారు కూడా. "రోజూ మీరు తీసుకునే ఆహారం ఏంటి" అని అడిగిన ఆసక్తికర ప్రశ్నకు బదులిచ్చారు మిలింద్‌. "ఎంతో మంది మీరు ఏం తింటారంటూ నన్ను అడిగారు. నేను ఉన్న చోటు బట్టి, అక్కడ అందుబాటులో ఉండే ఆహారం బట్టి నా డైట్‌ ఉంటుంది" అని చెప్పారు.

  • ఉదయం లేవగానే గోరువెచ్చటి నీరు తాగుతా!
  • అల్పాహారం(ఉదయం 10 గంటలకు): కొన్ని నట్స్‌ (డ్రైఫ్రూట్స్‌), బొప్పాయి, పుచ్చకాయతో పాటు సీజనల్‌ ఫ్రూట్స్‌ (నాలుగు ముక్కలు)
  • లంచ్‌ (సుమారు మధ్యాహ్నం 2గంటలకు): అన్నం, దాల్‌ కిచిడి (పప్పు) (సీజనల్‌ కూరగాయలు), ఇంటిలో తయారు చేసిన నెయ్యి, అన్నం లేనప్పుడు ఆరు చపాతీలు, కూర/పప్పు, అప్పుడప్పుడు చికెన్‌, మటన్‌, గుడ్డు తక్కువ మోతాదులో తీసుకుంటా.
  • (సాయంత్రం 5గంటలకు): అప్పుడప్పుడు ఒక కప్పు బెల్లంతో తయారు చేసిన బ్లాక్ టీ
  • డిన్నర్‌ (సుమారు రాత్రి 10గంటలకు): కూరగాయ ముక్కలు.. ఆకలి మరీ ఎక్కువైతే కిచిడి.. మాంసం మాత్రం ముట్టను.
  • నిద్రపోయే ముందు: వేడి నీళ్లల్లో పసుపు, బెల్లం కలిపిన నీరు తాగుతా. ఐస్‌క్రీమ్‌లాంటి పదార్థాలు తీసుకున్నా దాదాపు అందులో బెల్లం ఉండేలా చూసుకుంటా.
  • సాధ్యమైనంత వరకూ రిఫైండ్‌, ప్యాక్ చేసి అమ్మిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటా. నీరు కావాల్సినంత తీసుకుంటా. ఏడాదికి రెండు సార్లు మాత్రమే మద్యం సేవిస్తా.. అదీ ఒక్క గ్లాసే.
  • ఈ క్వారంటైన్‌ వేళ ఆహార నియమావళిలో ఎలాంటి మార్పు లేదు. రోగనిరోధక శక్తి పెంచే కషాయం (కధా) నాలుగు వేళలా తీసుకుంటా. కరోనా వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది’’ అని తన ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్‌ మిలింద్‌.

ABOUT THE AUTHOR

...view details