తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లైగర్' కోసం దిగ్గజ బాక్సర్​​.. ఆసక్తిగా 'కొండపొలం' ట్రైలర్​ - mike tyson in liger

సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లైగర్'(vijay devarkonda liger movie)​, 'కొండపొలం'(vaishnav tej kondapolam) సినిమా నుంచి అప్డేట్స్​ వచ్చేశాయి. వీటితో పాటు పలు చిత్రాల వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Sep 27, 2021, 4:06 PM IST

Updated : Sep 27, 2021, 4:35 PM IST

సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్​ దేవరకొండ 'లైగర్'(vijay devarkonda liger movie) సినిమా​ అప్డేట్​ వచ్చేసింది. గతంలో దిగ్గజ బాక్సర్​ మైక్​ టైసన్​(mike tyson in liger movie) ఇందులో నటించనున్నాడంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇప్పడా వార్తనే నిజం చేస్తూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అతడు తొలిసారి భారతీయ​ చిత్రంలో మెరవనున్నాడు. ఈ మూవీకి పూరీజగన్నాథ్ దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్​. పాన్‌ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.

'కొండపొలం' ట్రైలర్​

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'కొండపొలం'(kondapalem movie release date). క్రిష్‌ దర్శకుడు. రాజీవ్‌ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలు. అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్‌ తేజ్‌, ఓబులమ్మగా రకుల్‌(vaishnav tej kondapolam) ఆకట్టుకుంటున్నారు. ఈ జోడీ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎం. ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన 'కొండపొలం' నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

మేకింగ్​ వీడియో

సిద్ధార్థ్​, శర్వానంద్​ నటించిన మల్టీస్టారర్​ చిత్రం 'మహాసముద్రం'(mahasamudram release date). ఇటీవల ఈ చిత్రంలోని అదితి రావ్​ హైదరీ నటించిన 'చెప్పకే చెప్పకే' పాట విడుదలై శ్రోతలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఈ గీతానికి సంబంధించిన మేకింగ్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

'సర్దార్​ ఉద్దమ్​' ట్రైలర్​

విక్కీ కౌశల్‌ కీలక పాత్రలో(vicky kaushal new movie) సూజిత్‌ సిర్కార్‌ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్‌ డ్రామా 'సర్దార్ ఉద్దమ్‌'(sardar udham amazon). చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అక్టోబరు 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

1919 జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. జలియన్‌ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్‌ తన సైన్యంతో వచ్చి, తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో మొత్తం వెయ్యికు పైగా భారతీయులు మృత్యువాతపడ్డారు. భారతదేశ చరిత్రలో అదొక చీకటిదినంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. వందల మంది మృతికి కారణమైన జనరల్‌ డయ్యర్‌ను విప్లవకారుడైన ఉద్దమ్‌ సింగ్‌ కాల్చి చంపాడు. అనంతరం ఉరిశిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఈ కథతోనే విక్కీ-సూజిత్‌ సిర్కార్‌లు 'సర్దార్‌ ఉద్దమ్‌'(sardar udham release date) తెరకెక్కించారు.

ఇదీ చూడండి: 'రిపబ్లిక్'​ మేకింగ్​ వీడియో.. 'రాకెట్రీ' రిలీజ్​ డేట్​

Last Updated : Sep 27, 2021, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details