తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రానా.. నీకు పెళ్లైనా ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నా!' - రానా అభిమాని మిహికా స్వీట్​ రిప్లై

టాలీవుడ్​ హీరో రానా దగ్గుబాటికి పెళ్లైనా ఆయన్ని ఇంకా ప్రేమిస్తున్నట్లు ఓ నెటిజన్​ కామెంట్ చేసింది. అయితే దీనికి రానా, అతని భార్య మిహికా ఇచ్చిన రిప్లై నెటిజన్లకు నవ్వు తెప్పించే విధంగా ఉంది.

Miheeka Bajajs hilarious response to a fan who still loves Rana Daggubati
'రానా.. నీకు పెళ్లైనా ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నా!'

By

Published : Nov 12, 2020, 5:45 AM IST

టాలీవుడ్‌ స్టార్‌ రానా దగ్గుబాటి పెళ్లితో ఎంతో మంది అమ్మాయిల హృదయాలు నొచ్చుకున్నాయి. రానా త్వరలో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. 'సౌత్‌బే' పేరుతో ఈ యూట్యూబ్‌ ఛానెల్‌ ఆరంభం కానుంది. ఇందులో వివిధ రకాల కంటెంట్‌ని అందించబోతున్నారు. పది సెకన్ల నుంచి పది గంటల వరకు కథలను చెప్పబోతున్నామని రానా పేర్కొన్నారు. కేవలం కథలే కాకుండా సంగీతం, యానిమేషన్‌, ఫిక్షన్ అంశాలపై కూడా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

తన ఛానెల్‌ ప్రచారంలో భాగంగా రానా సోషల్‌ మీడియాలో 'ఆస్క్‌ మీ ఎనీథింగ్‌' సెషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. 'రానా.. నీకు పెళ్లి అయినప్పటికీ నేను ప్రేమిస్తున్నా..' అని పోస్ట్‌ చేశారు. దీనికి రానా స్పందిస్తూ.. 'మిహీకాకు పిచ్చి ఎక్కుతుంది, బాధ పడుతుంది' అనే అర్థంతో రిప్లై ఇచ్చారు. దీనికి మిహీకా ఫన్నీగా స్పందించారు. 'నేను నీతో ఉన్న దానికంటే ఎక్కువ పిచ్చెక్కదు' అని కామెంట్‌ చేయడం అందర్నీ నవ్విస్తోంది.

రానా నటించిన 'అరణ్య' సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ఆయన చేతిలో '1945', 'హిరణ్య కశ్యప', 'విరాట పర్వం' తదితర చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ దశల్లో ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్నాయి. రానా తన ప్రియురాలు మిహీకా బజాజ్‌ను ఆగస్టు 20న వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో శుభకార్యాన్ని నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details