తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మిషెల్ ఒబామా.. ఇకపై గ్రామీ అవార్డు విజేత

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్​ ఒబామా.. గ్రామీ వేడుకల్లో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. 'బికమింగ్​' అనే ఆమె పుస్తకం 'బెస్ట్​ స్పోకెన్​ వర్డ్​ ఆల్బమ్​ ఆఫ్​ ద ఇయర్​' అవార్డును కైవసం చేసుకున్నారు.

Michelle Obama wins Grammy for 'Becoming' audio book
మిచెల్లీ ఒబామా.. ఇకపై గ్రామీ అవార్డు విజేత

By

Published : Jan 27, 2020, 1:11 PM IST

Updated : Feb 28, 2020, 3:21 AM IST

2020 గ్రామీ అవార్డుల ముందస్తు వేడుక లాస్​ ఏంజెల్స్​లో ఆదివారం జరిగింది. ఇందులో యూఎస్​ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఆమె రాసిన 'బికమింగ్​' అనే ఆడియో ఆల్బమ్..​ ఈ పురస్కారం సొంతం చేసుకుంది. 'బికమింగ్​'లో మిషెల్.. తన జీవిత ప్రయాణం గురించి ప్రస్థావించారు. చికాగో దక్షిణ భాగం నుంచి ఆమెరికా వరకు ఆమె సాగించిన ప్రస్థానమే ఈ 'బికమింగ్​'.

మాజీ అధ్యక్షుడికీ రెండు అవార్డులు

మిచెల్ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా ఇప్పటికే రెండుసార్లు ఈ అవార్డును దక్కించుకున్నారు. ఆయన రాసిన 'డ్రీమ్స్​ ఫ్రమ్​ మై ఫాదర్​'(2006), 'ద అడాసిటీ ఆఫ్​ హోప్​'(2008)లు ఈ ఘనత సాధించాయి.

రెండో మహిళగా మిషెల్

గ్రామీ అవార్డు దక్కించుకున్న రెండో 'తొలి' మహిళ మిషెల్​ ఒబామా (అమెరికా అధ్యక్షుడి భార్యను 'తొలి మహిళ' అంటారు). బిల్​ క్లింటన్​ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన భార్య, అమెరికా మాజీ సెక్రటరీ హిల్లరీ క్లింటన్​.. 'ఇట్​ టేక్స్​ ఏ విలేజ్​'(1997) పుస్తకానికి గ్రామీ అవార్డును కైవసం చేసుకున్నారు. బిల్​ క్లింటన్​ కూడా రెండు సార్లు ఈ అవార్డుకు నామినేట్​ అయ్యారు.

ఇదీ చదవండి:ఎన్టీఆర్​ సరసన ముద్దుగుమ్మ రష్మిక!

Last Updated : Feb 28, 2020, 3:21 AM IST

ABOUT THE AUTHOR

...view details