'భాగమతి' వంటి హిట్ తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'నిశ్శబ్దం'. మాధవన్, అవసరాల శ్రీనివాస్, అంజలి, షాలినీ పాండే తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అతడి ఫస్ట్‌లుక్, పాత్ర వివరాలను గురువారం విడుదల చేశారు.
మైకేల్.. ఇందులో రిచర్డ్ డికెన్స్ పాత్రలో కనిపించనున్నాడు. అనుష్కకు సంబంధించిన కేసు విచారణ జరిపే పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా దర్శనమివ్వనున్నాడట. పోస్టర్‌లో సీరియస్ లుక్‌తో స్టైలిష్‌గా కనిపించాడీ నటుడు.