క్రిస్ హేమ్స్‌వర్త్.. అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 'అవెంజర్స్'లో థోర్ అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. తాజాగా క్రిస్ నటించిన 'ఎమ్ఐబీ ఇంటర్నేషనల్' చిత్రం జూన్ 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 'మెన్ ఇన్ బ్లాక్' సిరీస్‌లో ఇది నాలుగో చిత్రం. టెస్సా థాంప్సన్, లీయామ్ నీసాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్, యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అద్భుత పోరాట సన్నివేశాలు, విజువల్స్‌తో ఆసక్తికరంగా ఉంది ప్రచార చిత్రం. గ్యారీ గ్రే దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొలంబియా పిక్చర్స్ నిర్మిస్తోంది.