కరోనా లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం బుధవారం మరోసారి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటివరకు 50 శాతం సీటింగ్‌కే పరిమితమున్న థియేటర్ల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వెల్లడించింది.
ఇకపై థియేటర్లు హౌస్‌ఫుల్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ - 100 శాతం సీటింగ్‌తో థియేటర్లు
కరోనా లాక్డౌన్ తర్వాత ప్రస్తుతం 50 శాతం సీటింగ్ పరిమితితో థియేటర్లు నడుస్తున్నాయి. అయితే తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. థియేటర్ల సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వెల్లడించింది.
ఇకపై థియేటర్లు హౌస్‌ఫుల్
ఇటీవల సంక్రాంతి సీజన్‌కు ముందు థియేటర్ల సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచుతున్నట్లు తమిళనాడు, పశ్చిమ బంగాల్ ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ ఈ నిర్ణయానికి కేంద్రం అడ్డు చెప్పడం వల్ల మళ్లీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తాజాగా కేంద్రమే థియేటర్ల సామర్థ్యం పెంపుపై నిర్ణయం తీసుకోవడం వల్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.