తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పెళ్లి చూపులు'లాగా ఈ మూవీ హిట్ అవుతుంది' - ముగ్గురు మొనగాళ్లు ప్రీరిలీజ్ ఈవెంట్

దినేష్‌ తేజ్‌, శ్వేతా అవస్తి జంటగా కె.పవన్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం 'మెరిసే మెరిసే', శ్రీనివాస్‌రెడ్డి, దీక్షిత్‌శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ముగ్గురు మొనగాళ్లు' ముందస్తు వేడుకను నిర్వహించారు. రెండు సినిమాలూ నేడు విడుదల కానున్నాయి.

Merise Merise
మెరిసే మెరిసే

By

Published : Aug 6, 2021, 7:35 AM IST

దినేష్‌ తేజ్‌, శ్వేతా అవస్తి జంటగా కె.పవన్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం 'మెరిసే మెరిసే'. వెంకటేష్‌ కొత్తూరి నిర్మించారు. శుక్రవారం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు వి.వి. వినాయక్‌ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.. "మంచి బృందంతో చక్కటి ప్రయత్నం చేశారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. పెళ్లి చూపులు లాంటి విజయాన్ని ఈ చిత్రం అందుకుంటుందని ఆశిస్తున్నా" అన్నారు.

దినేష్ తేజ్, వినాయక్, పవన్ కుమార్

శ్రీనివాస్‌రెడ్డి, దీక్షిత్‌శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ముగ్గురు మొనగాళ్లు'. అభిలాష్‌రెడ్డి దర్శకత్వం వహించారు. పి.అచ్యుత రామారావు నిర్మాత. శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌ వీడియో ద్వారా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

ముగ్గురు మొనగాళ్లు ప్రీరిలీజ్ ఈవెంట్

ఇవీ చూడండి: ఓటీటీలోనే 'టక్ జగదీష్'.. డీల్ కుదిరింది!

ABOUT THE AUTHOR

...view details