ప్రకాశ్ కోవెలమూడి దర్శత్వంలో నటుడు రాజ్‌కుమార్ రావ్, క్వీన్ కంగనా రనౌత్ జంటగా నటించిన చిత్రం 'మెంటల్ హై క్యా'. ఈ టైటిల్ మానసిక వికలాంగులను కించపరిచేలా ఉందనే కారణంతో మార్చాలని సూచించింది సెన్సార్ బోర్డు. టైటిల్‌ను 'జడ్జిమెంటల్ హై క్యా'గా మార్చినట్లు ప్రకటించింది చిత్రబృందం.
" మానసిక సమస్యలతో ఉన్న వారిని కించపరిచే ఉద్దేశం ఏమీ లేదు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవట్లేదు. అందుకే సినిమా పేరును 'జడ్జిమెంటల్ హై క్యా'గా మార్చాం. ఈ థ్రిల్లర్‌లో కంగనా, రాజ్‌కుమార్ అద్భుతంగా నటించారు. థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూడాలనుంది" - చిత్రబృందం