నిర్భయ దోషులను ఉరి తీయడం వల్ల ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అత్యాచార బాధితుల పేరుతో స్మారకాలు నిర్మించాలని కోరింది. అత్యాచారానికి పాల్పడే వారిని, యాసిడ్ దాడులకు తెగబడే మృగాళ్లని ఈ సమాజం క్షమించదని వాటి ద్వారా తెలియజేయాలని చెప్పింది. నిర్భయపై 2012, డిసెంబర్ 16న బస్సులో అత్యంత కిరాతంగా అత్యాచారం జరిగింది. ఆ గాయాలతో పోరాడుతూనే ఆమె ప్రాణాలు విడిచింది.
'నిర్భయ దోషులకు స్మారకాలు నిర్మించాలి' - kanga about nirbhaya
ఉరి కంబానికి వేలాడిన నిర్భయ దోషుల స్మారకాలను నిర్మించాలని కోరింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఫలితంగా హత్యాచారానికి, యాసిడ్ దాడులకు పాల్పడే మృగాళ్లని ఈ సమాజం క్షమించదని వాటి ద్వారా తెలియాజేయాలని చెప్పింది.
'నిర్భయ దోషులకు స్మారకాలు నిర్మించాలి'
మన న్యాయ వ్యవస్థ పురాతనమైందని అందుకే దోషులకి శిక్ష పడేందుకు ఇంత సుదీర్ఘ సమయం పట్టిందని కంగన తెలిపింది. అలాంటి దురదృష్టకర ఘటనలు జరిగిన వెంటనే తక్షణ న్యాయం జరిగితే, ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అంది. ఈ ఏడు సంవత్సరాలు నిర్భయ కుటుంబాన్ని, ఆమె తల్లి ఆశాదేవిని పరోక్షంగా బాధపెట్టామని వాపోయింది. తన 'క్వీన్' సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని తెలిపింది.
ఇదీ చూడండి : పవర్‌స్టార్ పవన్‌పై ప్రేమతో తమన్ స్పెషల్ సాంగ్!