తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఘనంగా హీరోయిన్ మెహరీన్ నిశ్చితార్థం - Mehreen movie news

జైపుర్​లోని ఓ కోటలో హీరోయిన్ మెహరీన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఆమెనే ఇన్​స్టా వేదికగా పంచుకుంది.

Mehreen Pirzadaa gets enagaged to Congress leader Bhavya Bishnoi
ఘనంగా హీరోయిన్ మెహరీన్ నిశ్చితార్థం

By

Published : Mar 12, 2021, 6:34 PM IST

తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మెహరీన్‌. ఈ అందాల భామ నిశ్చితార్థం ఆమె ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో శుక్రవారం ఘనంగా జరిగింది. జైపుర్‌లోని ఓ కోట ఈ కార్యక్రమానికి వేదికైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది మెహరీన్‌. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

మెహరీన్ పోస్ట్ చేసిన ఫొటో

మెహరీన్‌కు కాబోయే వరుడు భవ్య బిష్ణోయ్ హరియాణ మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో తన ప్రేమ విషయాన్ని మెహరీన్‌ తెలియజేసింది.

నాని 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో మెహరీన్‌ తెలుగుతెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్‌', 'ఎఫ్‌2' లాంటి చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం 'ఎఫ్‌3'లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details