తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా పెళ్లి వార్త నిజమే: మెహరీన్‌

జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు నటి మెహరీన్. ఆమె పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజమేనని స్పష్టం చేశారు.

mehreen kaur pirzada confirms her engagement next month
నా పెళ్లి వార్త నిజమే: మెహరీన్‌

By

Published : Feb 14, 2021, 5:41 PM IST

తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలు నిజమేనని నటి మెహరీన్‌ తెలిపారు. త్వరలోనే తాను వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నానన్నారు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ'తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పెళ్లిపై మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.

ఆ వార్తలపై మెహరీన్ స్పందించారు. తన పెళ్లి వార్తలు నిజమేనని.. వచ్చే నెలలో నిశ్చితార్థం జరగనుందని.. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోన్నందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె వివరించారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఈ ముద్దుగుమ్మ వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని జైపుర్‌ అలీలా కోటలో మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. మరోవైపు 'ఎఫ్‌2'కు కొనసాగింపుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న 'ఎఫ్‌3'లో ఆమె నటిస్తోంది.

ఇదీ చూడండి:వాలంటైన్స్ డే: ప్రేమికుల నోట.. పలకాలి ఈ పాట!

ABOUT THE AUTHOR

...view details