తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెహరీన్​కు బర్త్​డే విషెస్​.. పోస్టర్ రిలీజ్​! - entha manchivadavura

టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ పుట్టినరోజు సందర్భంగా 'ఎంతమంచివాడవురా' చిత్రబృందం ఆమె పోస్టర్ విడుదల చేసింది. కల్యాణ్​రామ్​ పక్కన తొలిసారి నటిస్తోంది మెహరీన్​. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెహరీన్​కు బర్త్​డే విషెస్​.. పోస్టర్ రిలీజ్​!

By

Published : Nov 5, 2019, 11:09 AM IST

కృష్ణగాడి వీర ప్రేమ గాథ, రాజా ది గ్రేట్, ఎఫ్​2 లాంటి హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి మెహరీన్. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మెహరీన్​కు శుభాకాంక్షలు తెలిపింది 'ఎంతవాడవురా' చిత్రబృందం. ఈ సినిమాలోని ఆమె పోస్టర్​ను విడుదల చేసింది.

మెహరీన్​

ఈ చిత్రంతో తొలిసారి కల్యాణ్​రామ్​ సరసన నటిస్తోంది మెహరీన్​. 'శతమానం భవతి' ఫేమ్ సతీశ్ వెగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శుభాష్ గుప్తా, ఆదిత్య గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం టాలీవుడ్​తో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది.

ఇటీవలే గోపీచంద్ హీరోగా వచ్చిన 'చాణక్య'తో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం 'ఎంతమంచి వాడవురా' చిత్రంతో పాటు తమిళంలో ఒకటి, పంజాబీలో మరో చిత్రంలో నటిస్తోంది. నాగశౌర్య 'అశ్వథ్థామ'​లోనూ మెహరీనే హీరోయిన్.

ఇదీ చదవండి: ట్రైలర్​: మీ భార్యను ప్రేమిస్తున్నారా.. నిజమేనా!

ABOUT THE AUTHOR

...view details