తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆమె' పాత్రే నా డ్రీమ్ రోల్: మెహరీన్​ - telugu new movies

కళ్యాణ్​ రామ్​ సరసన 'ఎంత మంచివాడవురా' సినిమాలో నటిస్తున్న మెహరీన్... తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్​రోల్​ ఏంటో చెప్పింది. ఆమె ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటుందో కొన్ని ఉదాహరణలూ చెప్పుకొచ్చింది.

మెహరీన్​

By

Published : Nov 22, 2019, 4:06 PM IST

జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా కలకాలం ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేయాలనే తపన ప్రతి నటీనటులలో ఉంటుంది. అందుకే ఎప్పుడూ వారిని మీ డ్రీమ్​రోల్​ ఎంటి? అనే ప్రశ్న అడుగుతుంటారు. ఇప్పటివరకు ఎవరూ చేయని పాత్రలు చేయాలని కొందరు.. విభిన్నమైన క్యారెక్టర్లు​ చేయాలని మరికొంతమంది చెప్తుంటారు. తనకూ ఇలాంటి కలే ఉందంటోంది యువ కథానాయిక మెహరీన్​ కౌర్.

'రంగస్థలం'లో సమంత, 'మహానటి'లో కీర్తి సురేష్​, 'ఫిదా'లో సాయిపల్లవి, 'బాహుబలి'లో అనుష్క పోషించిన పాత్రలంటే మెహరీన్​కు చాలా ఇష్టమట. ఇలాంటి పాత్రలు పోషించాలంటే అదృష్టం ఉండాలని అంటోందీ ముద్దుగుమ్మ. గట్టి సవాలు విసిరే ఇలాంటి పాత్రల్లో నటిస్తే కిక్కే వేరు, భవిష్యత్తులో చేస్తానేమో! అని చెప్పుకొచ్చింది.

నటి మెహరీన్

'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మెహరీన్​.. ఆ తర్వాత 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్'​, 'నోటా', 'ఎఫ్​-2' లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కళ్యాణ్​ రామ్ హీరోగా తెరకెక్కుతున్న 'ఎంత మంచి వాడవురా' సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్​ దక్కించుకుంది. ఈ సినిమాకు సతీష్​ వేగెశ్న దర్శకుడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'రూలర్​' టీజర్​తో అదరగొట్టిన బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details