దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'.ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోంది. అయితే కొత్త షెడ్యూల్లో ఆలియా వస్తే, వీరిద్దరిపై సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రాక కోసం మెగాహీరో ఎదురుచూస్తున్నాడు.
ఆలియా భట్ రాక కోసం చెర్రీ నిరీక్షణ - ఆలియా తెలుగు సినిమా
'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే హీరోయిన్ ఆలియా భట్.. కొత్త షెడ్యూల్లో ఎప్పుడు పాల్గొంటుందా? అని హీరో రామ్‌చరణ్ ఎదురు చూస్తున్నాడు. వీరిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది.
ఆలియాకు 'ఆర్ఆర్ఆర్' తెలుగులో తొలి చిత్రం. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ.. ఇందులోని పాత్ర తనకెంతో ప్రత్యేకమని, ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
ఈ సినిమాలో తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్, రే స్టీవెన్స్టన్, అలీసన్ డూడీ, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఈ తేదీ అక్టోబర్‌కు మారే అవకాశముందనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.