యువ కథానాయకుడు నిఖిల్‌తో దర్శకుడు టి.ఎన్.సంతోష్ తెరకెక్కించిన చిత్రం 'అర్జున్ సురవరం'. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. నవంబరు 29 సందడి చేసేందుకు వచ్చేస్తుంది. ఈ సందర్భంగా నవంబరు 26న ముందస్తు విడుదల వేడుకను నిర్వహించనుంది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు చిరంజీవి హాజరవుతున్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్.
మెగాస్టార్ అతిథిగా 'అర్జున్ సురవరం' ప్రీరిలీజ్ ఫంక్షన్
నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 26న జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.
అర్జున్
"నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. 'గ్యాంగ్‌లీడర్' చిత్రంలోని చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో డైలాగ్ చెప్పుకుంటూ పాఠశాల మొత్తం తిరిగేవాడ్ని. ఇప్పుడు చిరంజీవే నాతో కరచాలనం చేయడం, చిత్ర వేడుకకు రావడం ఆశ్చర్యంగా ఉంది." అంటూ చెప్పుకొచ్చాడు హీరో నిఖిల్.
ఇవీ చూడండి.. త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రం..!