చిరంజీవి కొత్తలుక్ అదిరిపోతోంది. ఓ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్లో పాల్గొన్నాడు మెగాస్టార్. ఈ ఛాయాచిత్రాలను చిరు కోడలు ఉపాసన ట్విట్టర్లో పంచుకుంది.
రామ్ చరణ్ సతీమణి ఉపాసన బీ పాజిటివ్ హెల్త్ మ్యాగజైన్ నడుపుతోంది. తాజాగా ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చిరు ఫొటోషూట్లో పాల్గొన్నాడు.
చిరు ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటించాడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు ఇందులో నటిస్తున్నారు. అమితాబచ్చన్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.