ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కొందరు యువ దర్శకులతో వరసపెట్టి సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన సినిమాలపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తుండగా.. దర్శకులు సుజీత్/వి.వి వినాయక్, బాబీ సినిమాల్లో నటించనున్నారు. అయితే తాజాగా మెగాస్టార్‌కు సంబంధించి మరో సినిమా వార్త వినిపిస్తోంది. చిరు ఇదివరకు చెప్పినట్లుగానే ఇప్పుడు మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ కొత్త సినిమా దర్శకుడు అతడే! - చిరంజీవి ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొరటాలతో ఓ చిత్రం చేస్తున్న చిరు తర్వాత సుజీత్తోనూ ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా మెగాస్టార్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెహర్ రమేశ్‌తో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
తమిళ సూపర్‌స్టార్ అజిత్ నటించిన 'వేదాళం' అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని చిరంజీవి లేదా పవన్ కల్యాణ్‌తో రీమేక్ చేయనున్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ రీమేక్ చిత్రంలో చిరు నటించనున్నారని, దీనికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ రీమేక్ చిత్రానికి అనిల్ సుంకర (ఏకే ఎంటర్‌టైన్‌మెంట్) నిర్మాతగా వ్యవహరించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మెహర్ రమేశ్ 'వేదాళం' చిత్రాన్ని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మారుస్తున్నారని త్వరలో ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్రసీమలో అనుకుంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది. ఈ నెల 22న చిరు పుట్టిన రోజు. దీంతో చిరు సినిమా విశేషాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.