మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' సినిమా టీజర్ విడుదలై సోషల్‌మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమాలో రామ్చరణ్ కూడా సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు. చరణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్‌ను విడుదల చేశారు. అయితే ఈ ప్రచార చిత్రం రిలీజ్ అయిన కొద్దిసేపటికే సినిమా విడుదల తేదీని నిర్మాణసంస్థ ప్రకటించేసింది. వేసవి కానుకగా మే 13న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.
'ఆచార్య' సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్
"పాఠాలు చెప్పకపోయినా అందరు నన్ను ఆచార్య అని అంటుంటారు. ఎందుకంటే నేను గుణపాఠాలు చెబుతాననేమో" అని చిరంజీవి చెప్పిన సంభాషణలు 'ఆచార్య' టీజర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎర్ర కండువా చుట్టుకొని చేయి పైకెత్తిన మెగాస్టార్.. శత్రువులను చీల్చిచెండాతున్న దృశ్యాలు చూస్తే మెగా అభిమానులకు కావాల్సిన మాసిజాన్ని కొరటాల పుష్కలంగా వడ్డించారని తెలుస్తోంది.
దేవాలయాలు.. వాటి వెనుక కుట్రల నేపథ్యంగా సాగే 'ఆచార్య' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వాన్ని వహించారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదీ చూడండి:మెగాస్టార్ 'ఆచార్య' టీజర్ వచ్చేసిందోచ్!