తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాగబాబు పుట్టినరోజు.. మెగాహీరోలు ట్వీట్స్ - వరుణ్ తేజ ట్వీట్​

మెగాబ్రదర్ నాగబాబుకు.. చిరు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ట్విట్టర్​ వేదికగా ఫొటోల్ని పోస్ట్ చేశారు.

Nagababu_Birthday
మన అనుబంధం ఇలాగే కొనసాగాలి:చిరు

By

Published : Oct 29, 2020, 12:02 PM IST

నటుడు, నిర్మాత నాగబాబు పుట్టినరోజు సందర్బంగా, మెగాస్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెబుతూ ట్వీట్ చేశారు.

నాన్నకు ప్రేమతో..

నాన్న పుట్టినరోజు సందర్భంగా వరుణ్ తేజ్​ ట్వీట్​ చేశారు. 'ఈ అందమైన జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు మీకు ధన్యావాదాలు. మీరు ఎల్లప్పుడూ నా ఆప్త మిత్రుడిలానే ఉండాలి' అని రాసుకొచ్చాడు.

'మీ ప్రోత్సాహంతోనే'

నాగబాబు ప్రోత్సాహంతోనే తను ఆటల్లో రాణించానని, కళల్లో ప్రతిభ సాధించానని... ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్​ ట్వీట్​ చేశారు. 'నా ధైర్యం, నమ్మకం అయిన నాగబాబు మామకు జన్మదిన శుభాకాంక్షలు' అని రాసి, తన చిన్ననాటి ఫోటోను పోస్ట్​ చేశారు.

ఇదీ చదవండి:షూటింగ్ రీస్టార్ట్.. సెట్​లోకి బాలయ్య

ABOUT THE AUTHOR

...view details