తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వకీల్​సాబ్​' చిత్రాన్ని వీక్షించిన మెగా ఫ్యామిలీ - వరుణ్​ తేజ్​ వకీల్​సాబ్

పవన్​ కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్' చిత్రాన్ని మెగాస్టార్​ చిరంజీవి కుటుంబసమేతంగా థియేటర్​కు వెళ్లి వీక్షించారు. వీరితో పాటు హీరోలు వరుణ్​ తేజ్​, సాయితేజ్​, నిఖిల్​ విరివిగా సినిమాను చూసి.. పవన్​ నటనపై ప్రశంసలు కురిపించారు.

Megastar Chiranjeevi watches Vakeel Saab with his family
'వకీల్​సాబ్​' చిత్రాన్ని వీక్షించిన మెగా ఫ్యామిలీ

By

Published : Apr 10, 2021, 8:58 AM IST

Updated : Apr 10, 2021, 9:58 AM IST

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం 'వకీల్​సాబ్​'. శుక్రవారం థియేటర్లలో విడుదలై విశేషాదరణ దక్కించుకుంటోంది. బెన్​ఫిట్​షో నుంచి సినిమాహాళ్ల అభిమానుల సందడి మొదలైంది. వరుస షోలతో 'వకీల్​సాబ్​' కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతుంది.

అయితే ఈ సినిమాను థియేటర్​లోనూ వీక్షిస్తానని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. శుక్రవారం రాత్రి కుటుంబ సమేతంగా 'వకీల్​సాబ్' చిత్రాన్ని వీక్షించారు. చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖ.. నాగబాబు కుటుంబం, సాయితేజ్​ ఈ సినిమాను విడివిడిగా వీక్షించారు. ఈ చిత్రంతో పవన్​ కల్యాణ్​.. పవర్​ ప్యాక్డ్​ కమ్​బ్యాక్​ అంటూ వరుణ్​తేజ్​, సాయితేజ్​ ట్వీట్ చేశారు. మరోవైపు యువ కథానాయకుడు నిఖిల్​ కూడా కుటుంబ సమేతంగా స్నేహితులతో వెళ్లి చిత్రాన్ని వీక్షించారు.

అంజనా దేవితో చిరంజీవి
సినిమా వీక్షిస్తున్న సురేఖ, చిరంజీవి
థియేటర్​ నుంచి బయటకు వస్తున్న చిరంజీవి ఫ్యామిలీ
నాగబాబు
సోదరితో వరుణ్​ తేజ్​
సాయితేజ్​
ఫ్యామిలీ ఫ్రెండ్స్​తో హీరో నిఖిల్​
Last Updated : Apr 10, 2021, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details