తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేక షో! - చిరంజీవి ఉప్పెన

మెగాస్టార్ చిరుకు కోసం 'ఉప్పెన' సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

chiranjeevi
చిరంజీవి

By

Published : Jun 4, 2020, 7:07 PM IST

'నీ కన్ను నీలి సముద్రం' పాటతో విడుదలకు ముందే క్రేజ్ తెచ్చుకుంది 'ఉప్పెన'. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్​తేజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. అయితే ఏప్రిల్​లో రావాల్సిన ఈ సినిమా... కరోనా వల్ల ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరిచేలా కనిపించడం లేదు. అయితే 'ఉప్పెన' చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి చెప్పారట. దీంతో ఆయన కోసం ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్.

ఇందులో హీరోయిన్​గా కృతిశెట్టి నటించింది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. గ్రామీణ నేపథ్య కథతో రూపొందించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

ఇదీ చూడండి : 'నిశ్శబ్దం'గా సినిమా చూసిన పూరీ!

ABOUT THE AUTHOR

...view details