Chiranjeevi on Cinema Tickets Price: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ధరలు సవరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు చేసే నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేశారని ట్విటర్ వేదికగా అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ కోరికను మన్నించి కేసీఆర్ సత్వరమే నిర్ణయం తీసుకోవడం పట్ల మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యానికి న్యాయం జరిగేలా టికెట్ ధరలను సవరించడం ఆనందంగా ఉందన్నారు.
Chiranjeevi on Cinema Tickets Price : సినిమా టికెట్ల ధరల పెంపుపై మెగాస్టార్ హర్షం.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు - టికెట్ల ధరల పెంపుపై మెసాస్టార్ ట్వీట్
Chiranjeevi on Cinema Tickets Price : తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచి ఎంతో మంది కార్మికులకు మేలు చేశారని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ధరలు సవరించి అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేశారని కొనియాడారు. తెలుగు సినీ పరిశ్రమ కోరికను మన్నించి కేసీఆర్ సత్వరమే నిర్ణయం తీసుకోవడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
![Chiranjeevi on Cinema Tickets Price : సినిమా టికెట్ల ధరల పెంపుపై మెగాస్టార్ హర్షం.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు Chiranjeevi on Cinema Tickets Price](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14005784-thumbnail-3x2-a.jpg)
Chiranjeevi on Cinema Tickets Price Hike : తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏసీ థియేటర్లలో టికెట్ ధర కనిష్ఠంగా 50 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్లలో 30 రూపాయలు పెంచుకోవచ్చని సూచించింది. అలాగే మల్టీప్లెక్స్‌లలో కనిష్ఠంగా టికెట్ ధర జీఎస్టీతో కలిపి 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏసీ థియేటర్లలో గరిష్ఠంగా 150 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్లలో 70 రూపాయలు పెంచుకోవచ్చని సూచించింది. సింగిల్ థియేటర్లలో స్పెషల్ సీట్లకు జీఎస్టీ అదనంగా 200, స్పెషల్ ఐమ్యాక్స్ లేదా అతి పెద్ద తెర ఉన్న సింగిల్ థియేటర్లలో 250 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 300 రూపాయలు గరిష్ఠంగా పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లలో 5 రూపాయలు, నాన్ ఏసీకి 3 రూపాయలు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
AP Cinema Tickets Issue : మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలపై వివాదం ఇంకా సద్దుమణగకపోవడంతో అక్కడి థియేటర్ యాజమాన్యాలు తాత్కాలికంగా సినిమా హాల్స్‌ను మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సినీ పెద్దలు జోక్యం చేసుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.