"ఓ రోజు పేపర్లో మహేశ్.. ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఫొటో చూడగానే కత్తిలా అనిపించాడు" అని మెగాస్టార్ చిరంజీవి అన్నాడు. హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన 'సరిలేరు నీకెవ్వరు' మెగాసూపర్ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు. వీటితో పలు విషయాలను పంచుకున్నాడు.
"మహేశ్‌బాబును చూస్తే, నా బిడ్డలాంటి ఫీలింగ్ కలుగుతుంది. అతడి చిరునవ్వు వెనక చిలిపితనం ఉంటుంది. దొంగ...! చాలా రోజుల క్రితం పేపర్లో 'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్‌లుక్ చుశా. అప్పుడు మహేశ్ ఫొటో చూడగానే కత్తిలా ఉన్నాడనిపించింది. ఈ కత్తికి రెండు వైపులా పదును ఉందా అనిపించింది. అందులో చాలా స్మార్ట్‌గా ఉన్నాడు. వెంటనే సినిమా చూడాలన్న ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకు అంటే ఈ మధ్యనే, నాకు ఫోన్ చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావాలన్నారు. నేను షాక్ తిన్నా. ఇంత త్వరగా ఎలా పూర్తి చేశారబ్బా? అని అనిపించింది. ఇలాంటి మార్పే టాలీవుడ్లో రావాలి. యుద్ధ ప్రాతిపదికన తీస్తే ఇంతకంటే కావాల్సింది ఏముంది. నేను ఈ విషయం గురించి, నాతో తర్వాత సినిమా తీస్తున్న కొరటాలతో మాట్లాడాను. 80-99 రోజుల్లో తీస్తానని, 100వ రోజు తీసుకోనని అన్నాడు." -మెగాస్టార్ చిరంజీవి
అదే విధంగా సూపర్‌స్టార్ కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా ప్రభుత్వాలు కృషి చేయాలని చిరంజీవి అన్నాడు.