తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​కల్యాణ్​ మేనరిజంతో అదరగొట్టిన మెగాస్టార్ - అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్

హైదరాబాద్​లో జరిగిన 'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో పవన్​ మార్క్​ మేనరిజంతో అలరించాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ వీడియో వైరల్​గా మారింది.

చిరంజీవి-పవన్​కల్యాణ్
పవన్​కల్యాణ్​ మేనరిజంతో అదరగొట్టిన మెగాస్టార్

By

Published : Nov 27, 2019, 8:40 AM IST

మెగాస్టార్ చిరంజీవి.. పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ను గుర్తు చేశాడు. సోమవారం జరిగిన 'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరైన ఈ హీరో.. మెడపై చేయిపెట్టే పవన్​ మేనరిజంను అనుకరించాడు. ఈ సినిమాలో చేగువేరా పాట ఒకటుందని, అది చూడగానే తన తమ్ముడే గుర్తొచ్చాడని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

'అర్జున్ సురవరం'లో పాత్రికేయుడిగా నిఖిల్ కనిపించనున్నాడు. హీరోయిన్​ లావణ్య త్రిపాఠి. టి.సంతోష్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ ఆకట్టుకుంటోంది. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'అర్జున్ సురవరం' ప్రీరిలీజ్​ ఈవెంట్​లో కత్తి పట్టిన మెగాస్టార్

ABOUT THE AUTHOR

...view details