సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య(saidabad accused raju) చేసుకున్నాడు. స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నక్కల్ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని(saidabad raju dead body) గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. దీంతో రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. పాపకు న్యాయం జరిగిందంటూ ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు, పౌర సమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి" అని చిరంజీవి(saidabad chiranjeevi) ట్వీట్ చేశారు.
రాజు ఆత్మహత్య చేసుకున్న ఘటనను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించగా, ఆయన ట్వీట్‌ను మంచు మనోజ్ రీట్వీట్ చేస్తూ 'సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్.. దేవుడు ఉన్నాడు' అని పేర్కొన్నారు.