వైష్ణవ్ తేజ్(vaishnav tej kondapolam), రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'కొండపొలం'. (kondapolam movie)వైవిధ్యకథా చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ సినిమాను రూపొందించారు. నేడు (అక్టోబర్ 8) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi news) ఈ మూవీని ముందుగానే వీక్షించారు. దర్శకుడు క్రిష్, వైష్ణవ్‌తో కలిసి సినిమా చూశారు. అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా తన స్పందనను తెలియజేశారు.
"ఇప్పుడే కొండపొలం వీక్షించాను. ఇదొక అందమైన, మోటైన ప్రేమకథ. అలాగే ఇందులో శక్తివంతమైన సందేశం కూడా ఉంది. ఎల్లప్పుడూ విభిన్న కథలతో, సమకాలీన అంశాలతో సినిమా తీస్తూ నటీనటుల దగ్గర నుంచి అద్భుతమైన నటనను రాబట్టే క్రిష్ పనితనం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. అలాగే అవార్డులూ దక్కించుకుంటుంది."