అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లి అంజనాదేవికి శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. అనంతరం ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఓ పోలీస్ అధికారిణి.. మతస్థిమితం లేని ఓ మహిళకు అన్నం ముద్దలు తినిపిస్తూ కనిపించారని, ఆ దృశ్యం తనను కదిలించిందని చెప్పుకొచ్చారు. ఆమెలోని అమ్మతనం చూసి మురిసిపోయిన చిరు.. సదరు పోలీస్‌పై ప్రశంసలు కురిపించారు.
మెగాస్టార్ మనసును కదిలించిన ఆ దృశ్యం - మెగాస్టార్ చిరంజీవి వార్తలు
ఇటీవల కాలంలో వైరల్ మారిన పోలీస్ అధికారిణి వీడియో గురించి మాట్లాడిన చిరు... ఓ మతిస్థిమితం లేని యువత పట్ల ఆమె చూపిన ప్రేమ తన మనసును కదిలించిందని చెప్పుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి
పోలీసులు కఠినంగా ఉంటారనేది అసత్యమని, వారి హృదయం కారుణ్యంతో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత ఆమెతో తాను స్వయంగా మాట్లాడినట్లు తెలియజేశారు. ఏం మాట్లాడననేది తర్వాత వీడియోలో వెల్లడిస్తానని చెప్పారు.