మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) క్రమశిక్షణ సంఘం నుంచి మెగాస్టార్ చిరంజీవి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. నటుడు నరేశ్ అధ్యక్షతన 2019 మార్చిలో ఈ సంఘం ఏర్పాటైంది. మొదట్లో అంతా సవ్యంగానే సాగినా.. కొంతకాలానికి 'మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రెండుగా విడిపోయారు. ఆ తర్వాత కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్ జయసుధలతో కూడిన ఓ క్రమశిక్షణా సంఘం ఏర్పాటైంది.
'మా' క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా? - మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) క్రమశిక్షణ సంఘం నుంచి మెగాస్టార్ చిరంజీవి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ 'మా' వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించిన చిరంజీవి క్రమశిక్షణ సంఘానికి రాజీనామా చేయడంపై చిత్రపరిశ్రమలో రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి.
అయితే.. భేదాభిప్రాయాలు సద్దుమణగక ముందే కరోనా వెలుగు చూసింది. ఆ సమయంలో చిరంజీవి ముందుండి సీసీసీ అనే సంస్థను ఏర్పాటు చేసి.. విరాళాలు సేకరించి సినీ కార్మికులను ఆదుకున్నారు. కొవిడ్ ప్రభావం నుంచి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు 'మా' ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ సమయంలో ఇన్నాళ్లూ 'మా' వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించిన చిరంజీవి క్రమశిక్షణా సంఘానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇదీ చూడండి:"వకీల్‌సాబ్'తో ఆ కల నెరవేరింది!'