గాయని మంగ్లీ పాడిన కొత్త పాటను హీరో చిరంజీవి విడుదల చేశారు. దాము రెడ్డి దర్శకత్వం వహించిన ఈ పాటకు బాజి సంగీతాన్ని సమకూర్చారు. 'నా గురుడు నన్నింకా యోగిగమ్మనేనే' అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది.
చిరు రిలీజ్ చేసిన మంగ్లీ పాట-వెబ్‌సిరీస్‌తో మారుతి - మంగ్లీ యోగితత్వం సాంగ్
గాయని మంగ్లీ పాడిన కొత్త పాటను హీరో చిరంజీవి విడుదల చేశారు. ఈ గీతం శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. దర్శకుడు మారుతి పర్యవేక్షణలో '3 రోజెస్' వెబ్‌సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది.

చిరు
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కొత్త వెబ్సరీస్ '3రోజెస్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. శుక్రవారం ఈ సిరీస్ షూటింగ్‌ను ప్రారంభించారు. దర్శకుడు మారుతి క్లాప్ కొట్టగా.. ఈ సిరీస్‌ను నిర్మిస్తున్న ఎస్.కె.ఎన్(టాక్సీవాలా ఫేం) కెమెరా స్విచ్ ఆన్ చేశారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేయనున్నారు. ఇది మారుతి పర్యవేక్షణలో తెరకెక్కనుంది.