తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కిచ్చా 'పహిల్వాన్​'కు మెగాస్టార్​ మద్దతు

కన్నడ నటుడు సుదీప్​ నటించిన తాజా చిత్రం 'పహిల్వాన్'​. ఈ సినిమా తెలుగు పోస్టర్​ను మెగాస్టార్​ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా తొలిరూపును అభిమానులతో పంచుకుంది కొణిదెల ప్రొడక్షన్స్​ సంస్థ.

కిచ్చా 'పహిల్వాన్​'కు మెగాస్టార్​ మద్దతు

By

Published : Jun 5, 2019, 10:01 AM IST

తెలుగు తెరపై ఈగ‌, బాహుబ‌లి చిత్రాల‌లో మెరిసిన కన్నడ నటుుడు సుదీప్​ తాజాగా 'పహిల్వాన్'​ సినిమాలో నటించారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌. ఎస్​.కృష్ణ దర్శకుడు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి, కబీర్‌ దుహాన్‌సింగ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కిచ్చా సుదీప్​ బాక్సర్​గా అలరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​ పోస్టర్​ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా సుదీప్​కు శుభాకాంక్షలు చెప్తూ చిరు పోస్టర్​ రీలీజ్​ చేస్తోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది కొణిదెల ప్రొడక్షన్స్​.

కొణిదెల ప్రొడక్షన్స్​ సంస్థ విడుదల చేసిన చిత్రాలు

" సుదీప్ అద్భుతమైన, విలక్షణమైన, నిబద్ధత కలిగిన నటుడు. ప్రస్తుతం ‘పహిల్వాన్’గా వస్తున్నాడు. ఆ లుక్​లో కనిపించేందుకు అతను పడిన కష్టం చూసి ఆశ్చర్యమేస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఈ పహిల్వాన్‌ను ఆదరించాలని కోరుకుంటున్నాను. బ్రావో కిచ్చా సుదీప్. ఆల్ ది వెరీ బెస్ట్ ".
--మెగాస్టార్​ చిరంజీవి, సినీ హీరో

కొణిదెల ప్రొడక్షన్​ చేసిన ట్వీట్​కు స్పందించాడు సుదీప్​. తన సినిమా పోస్టర్​ కన్నా చిరంజీవి చాలా అందంగా, ఆకట్టుకునేలా ఉన్నారని ట్వీట్​ చేశాడు. పోస్టర్ విడుదల చేసినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపాడు. దక్షిణాదిన ఉన్న అన్ని భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు నిర్మాత స్వప్న కృష్ణ.

చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన సుదీప్​


చిరంజీవి న‌టిస్తోన్న సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో సుదీప్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details