తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా క్రైసిస్ ఛారిటీ సభ్యులపై మెగాస్టార్ ప్రశంసలు - megastar chiranjeevi CORONA CRISIS CHARITY

సుమారు 1000 మంది సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ సభ్యులను ప్రశంసించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయమే చెబుతూ, ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.

కరోనా క్రైసిస్ ఛారిటీ సభ్యులపై మెగాస్టార్ ప్రశంసలు
కరోనా క్రైసిస్ ఛారిటీ సభ్యులు

By

Published : Apr 15, 2020, 3:49 PM IST

లాక్​డౌన్ నేప‌థ్యంలో క‌రోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ).. మంగళవారం ఒక్కరోజు 1000 మంది సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించింది. ఈ విషయంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఛారిటీ సభ్యులపై ప్రశంసలు కురిపించారు.

కరోనా క్రైసిస్ ఛారిటీ సభ్యులను ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి

"ఒకే రోజు 1000 మందికి స‌రుకులు పంపిణీ చేశాం అంటే ఆశ్చ‌ర్య‌పోయాను. ఆనందంగా ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ సైనికుల్లా ముందుకొచ్చి ఇదొక బాధ్య‌త‌గా భావించి ఈ ప‌నిచేశారంటే ప‌రిశ్ర‌మలోని సభ్యులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. డ‌బ్బు ఉన్నా సేవచేసే వాళ్లు కావాలి. అంద‌రూ అభినందిస్తున్నారు. ప్ర‌శంసిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ పంపిణీ విధానం తెలుసుకుని నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు" -మెగాస్టార్ చిరంజీవి, కథానాయకుడు

ABOUT THE AUTHOR

...view details