Chiranjeevi on Rameshbabu: సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సహా పలువురు సినీప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
"రమేష్ బాబు మరణ వార్త విని షాకయ్యాను. అది నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కృష్ణగారు, మహేశ్‌బాబుతోపాటు కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను"
- చిరంజీవి
Pawankalyan on Rameshbabu: "రమేశ్ కన్నుమూశారాని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కృష్ణగారి కుటుంబసభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రమేశ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను."
-పవన్ కల్యాణ్.