తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దర్శకుడు కె.విశ్వనాథ్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి - చిరంజీవి దీపావళి

దీపావళి పండగ సందర్భంగా సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్​ను అగ్రకథానాయకుడు చిరంజీవి కలిశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

megastar chiranjeevi met senoir director k.viswanath
దర్శకుడు కె.విశ్వనాథ్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి

By

Published : Nov 14, 2020, 3:56 PM IST

Updated : Nov 14, 2020, 4:04 PM IST

దర్శకుడు కె.విశ్వనాథ్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి

కళాతపస్వి కె.విశ్వనాథ్​ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి, ఆశీస్సులు తీసుకున్నారు.

డాక్టర్ల తప్పిదం వల్ల కరోనా విషయంలో చిరంజీవి, ఇటీవలే పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిట్​లో సమస్య వల్ల తొలుత పాజిటివ్​ అని తేలగా, అనంతరం మరో రెండుసార్లు పరీక్షలు చేయించుకోగా మెగాస్టార్​కు నెగిటివ్​ అని ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు.

ప్రస్తుతం 'ఆచార్య' షూటింగ్​ కోసం సిద్ధమవుతున్నారు చిరు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి:మెగాస్టార్​ చిరంజీవికి కరోనా నెగిటివ్​

Last Updated : Nov 14, 2020, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details