తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగా అభిమానుల కోరిక నెరవేరనుందా!

మెగా అభిమానుల ఊహల్లోని కాంబినేషన్లలో చిరు- త్రివిక్రమ్​​ కాంబో ఒకటి. ఎప్పటికైనా వీరిద్దరూ సినిమా చేస్తే చూడాలనేది ఫ్యాన్స్​ కోరిక. త్వరలో ఇది నిజమయ్యేలా కనిపిస్తుంది.

Megastar Chiranjeevi Mediated For Trivikram Film?
మెగా అభిమానుల కోరిక నెరవేరనుందా!

By

Published : Jan 24, 2020, 12:32 PM IST

Updated : Feb 18, 2020, 5:34 AM IST

మెగాస్టార్ చిరంజీవి- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్​కు ఎంతో క్రేజ్. కాని వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు. అయితే ఈ ఇద్దరూ ఎప్పుడు కలిసి పనిచేస్తారా? అని మెగా అభిమానుల ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఇది నెరవేరనుందని టాలీవుడ్ వర్గాల టాక్. మెగాస్టార్​కు త్రివిక్రమ్ గతంలో ఒక లైన్​ చెప్పాడని, ఆ స్క్రిప్ట్​ను ఇప్పుడు పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నాడీ డైరెక్టర్. ఎన్టీఆర్​తో పనిచేయనున్న ఈ దర్శకుడు.. ఆ తర్వాత చిరుతో సినిమా చేస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పూర్తిగా కమర్షియల్​ ఎంటర్​టైనర్​

వీరిద్దరూ కలిసి చేసే ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్​టైనర్​గా ఉండనుందట. త్రివిక్రమ్ సినిమా అంటే.. ఎమోషన్స్​, యాక్షన్​తో పాటు హీరో కచ్చితంగా హాస్యం పండించాల్సిందే. కామెడీ విషయంలో మెగాస్టార్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఎంటర్​టైనర్​ అంటే ఏ స్థాయి​లో ఉంటుందో చూడాలి మరి.

చిరు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్.. 'అల వైకుంఠపురములో' చిత్రంతో హిట్ కొట్టాడు.

ఇదీ చదవండి: ఆకట్టుకుంటున్న 'అశ్వథ్థామ' సినిమా ట్రైలర్

Last Updated : Feb 18, 2020, 5:34 AM IST

ABOUT THE AUTHOR

...view details