తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాస్టార్ 'లూసిఫర్'​ రీమేక్​ షూటింగ్ షురూ - మోహన్​ రాజా

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా రూపొందుతున్న 'లూసిఫర్'​ రీమేక్​ చిత్రీకరణ మొదలైంది. ఈ మేరకు షూటింగ్ స్పాట్​ నుంచి ఓ చిత్రాన్ని షేర్​ చేశారు దర్శకుడు మోహన్ రాజా.

chiranjeevi
లూసిఫర్

By

Published : Aug 13, 2021, 9:26 AM IST

మెగాస్టార్​ చిరంజీవి కొత్త చిత్రం 'లూసిఫర్'​ రీమేక్​ షూటింగ్​ షురూ అయ్యింది. ఈ మేరకు దర్శకుడు మోహన్​ రాజా సెట్ నుంచి ఓ చిత్రాన్ని షేర్ చేశారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నట్లు తెలిపారు.

రీమేక్​ కోసం డీఓపీగా నీరవ్​ షా, ఆర్ట్​ డైరెక్టర్​గా సురేశ్ రాజన్, స్టంట్స్​ కోసం సిల్వను ఎంపిక చేసినట్లు మోహన్ రాజ వెల్లడించారు.

ఈ సినిమా కోసం తమన్ ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్​ సిద్ధం చేశారట. అవి మెగా అభిమానుల్ని అలరించనున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు మోహన్​రాజా, తమన్​ను కలిసిన చిరు.. వాళ్లతో కలిసి ఫొటో దిగారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

చిరుతో మోహన్​ రాజా, తమన్

ఇటీవల సరికొత్త లుక్​లో కనిపించిన చిరు.. ఫ్యాన్స్​ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ లుక్​ 'లూసిఫర్'​ రీమేక్​ కోసమేనని తెలుస్తోంది. అయితే ఇందులో నటించే ఇతర నటీనటులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

మలయాళ సూపర్​హిట్​ 'లూసిఫర్'. ఈ పొలిటికల్ డ్రామాలో మోహన్​లాల్, మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి తెలుగులో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

ఇదీ చూడండి:ఆ ఆశయం నెరవేరకుండానే దివికేగిన శ్రీదేవి!

ABOUT THE AUTHOR

...view details