తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కౌసల్య కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' - మెగాస్టార్ చిరంజీవి

నటి ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. ఈ సినిమా టీజర్​ను మంగళవారం మెగాస్టార్​ చేతుల మీదుగా విడుదల చేసింది చిత్రబృందం.

'కౌసల్య కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా'

By

Published : Jun 18, 2019, 6:14 PM IST

టీజర్​ విడుదల కార్యక్రమంలో మెగాస్టార్​ చిరు

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. ది క్రికెటర్‌ అనేది టాగ్‌లైన్‌. ఈ చిత్ర టీజర్‌ను జూన్‌ 18న మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చిరు... " క్రీడా నేపథ్యంలో తీసిన సినిమాలు ఇప్పటివరకు మంచి విజయాలు సాధించాయి. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరవుతుంది. తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్​ ఈ సినిమా కోసం తీసుకున్న శిక్షణ, ఆమె శ్రద్ధాసక్తులు అభినందనీయం. మన సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్‌ రావడం శుభపరిణామం. ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. స్వాగతం పలుకుతున్నా. ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా " అని వెల్లడించారు.

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌(స్పెషల్‌ రోల్‌), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, 'రంగస్థలం' మహేశ్‌, టాక్సీవాలా ఫేమ్‌ విష్ణు, రవిప్రకాశ్‌ తదితరులు ఈ సినిమాలో సందడి చేయనున్నారు. కె.ఎ వల్లభ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details