తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాత చిరులా.. అదిరే ఫైట్లు.. ఆకట్టుకునే స్టెప్పులు!

మెగాస్టార్​ చిరంజీవి.. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మునుపటి కంటే ఎక్కువ జోరు చూపిస్తున్నాడు. ఓ చిత్రం సెట్స్​పై ఉండగానే మరో చిత్రాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు చేస్తోన్నఓ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకొంటోంది.

Megastar Chiranjeevi is teaming up with director Koratala Siva for a yet-untitled film
పాత చిరులా.. అదిరే ఫైట్లు.. ఆకట్టునే స్టెప్పులు

By

Published : Feb 16, 2020, 10:39 PM IST

Updated : Mar 1, 2020, 1:56 PM IST

కొరటాల శివ దర్శకత్వంలో చిరు కథానాయకుడిగా కొత్త చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మెగాస్టార్‌కు జోడీగా త్రిష కనిపించనుండగా.. నక్సలైట్‌గా ఓ కీలక పాత్రలో రామ్‌చరణ్ మెరవనున్నాడని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రంలో డ్యాన్సులు, ఫైట్ల విషయంలో పాత చిరును గుర్తుచేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే చిత్రీకరణ ప్రారంభమైనప్పటి నుంచి సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్‌ ఎపిసోడ్లను, పాటలనే షూట్‌ చేస్తున్నారని తెలుస్తోంది.

పాత చిరులా.. అదిరే ఫైట్లు.. ఆకట్టునే స్టెప్పులు

ఇప్పటికే మూడు ఫైట్లు.. ఓ పాట చిత్రీకరణను పూర్తి చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాలోని నాలుగో ఫైట్‌ను షూట్‌ చేస్తున్నారట. ఈ సినిమా కోసం 'ఆచార్య' అనే పేరును పరిశీలిస్తోంది చిత్ర బృందం. ఈ ఏడాది ద్వితియార్ధంలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చదవండి:వినోదం, భావోద్వేగాలతో తెరకెక్కిన 'స్వేచ్ఛ'

Last Updated : Mar 1, 2020, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details