'సైరా' నరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. నా కలల ప్రాజెక్టు ఇంత గొప్ప విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. సినిమాలోని నటీనటులు, సాంకేతిక విభాగంపై ప్రశంసల వర్షం కురిపించాడు మెగాస్టార్.
'నా కలల ప్రాజెక్ట్ కోసం చాలా మంది ప్రాణం పెట్టారు' - సైరా థ్యాంక్యూ ఇండియా మీట్‌లో చిరంజీవి
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. శు్క్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం.. 'థ్యాంక్యూ ఇండియా మీట్'ను ఏర్పాటు చేసింది చిత్రబృందం.
ఇందులో జగపతిబాబు, విజయ్‌సేతుపతి, తమన్నా, నయనతార లాంటి స్టార్లు అద్భుతంగా నటించారని మెచ్చుకున్నాడు చిరు. దర్శకుడు సురేందర్ రెడ్డి.. తెలుగు చిత్రపరిశ్రమకు దొరికిన ఆణిముత్యంగా అభివర్ణించాడు. అనుష్క పాత్రను చివరి వరకు చెప్పకూడదని అనుకున్నామని, ప్రేక్షకుడికి ఆశ్చర్యపరిచేందుకే ఆమె గురించి ఎక్కడా చెప్పలేదని అన్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుందీ సినిమా. యూఎస్‌లో తక్కువ సమయంలో మిలియన్ డాలర్ క్లబ్లో చేరిన సినిమాగా నిలిచింది. ప్రీమియర్స్, తొలిరోజు కలిపి 1,45,000 డాలర్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. రాబోయే వారాంతంలో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది.