తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2019, 7:06 PM IST

ETV Bharat / sitara

జిమ్​లో మెగాస్టార్ కసరత్తులు.. ఫొటో వైరల్

మెగాస్టార్ చిరంజీవి.. జిమ్​లో కసరత్తులు చేస్తోన్న ఓ ఫొటో నెట్టింట వైరల్​ అవుతోంది. తన కొత్త సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలు కానుంది.

జిమ్​లో మెగాస్టార్ కసరత్తులు.. ఫొటో వైరల్

మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవలే 'సైరా' అంటూ పలకరించాడు. ఇప్పుడు తన తర్వాతి సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం జిమ్​లో కసరత్తులు చేస్తున్నాడు. ఆ ఫొటో ఇప్పుడు వైరల్​గా మారింది.

జిమ్​లో మెగాస్టార్ చిరంజీవి కసరత్తులు

చిరంజీవి 152వ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకుడు. రామ్​చరణ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే నెల తొలివారం నుంచి షూటింగ్ మొదలు కానుంది. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ప్రారంభోత్సవం

ఇందులో హీరోయిన్​గా త్రిషను తీసుకోవాలని భావిస్తోంది చిత్రబృందం. ఈ సినిమాకు 'గోవింద ఆచార్య', 'గోవిందా హరి గోవిందా' అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది చదవండి: చిరు తర్వాతి సినిమాలో డబుల్ ధమాకా..!

ABOUT THE AUTHOR

...view details