ట్విట్టర్లో పలువురు సెలబ్రిటీలపై తనదైన స్టైల్ పంచ్‌లతో అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి కుమారుడు రామ్‌చరణ్‌పై సెటైర్ వేశారు. మై డియర్ బచ్చా అంటూ సంభోదిస్తూ, 'మా అమ్మ దగ్గర నీ 'బటర్' ఉడకదురా! ఫస్ట్‌ప్లేస్ ఎప్పుడూ నాదే. నువ్వు ఎంత కష్టపడి బటర్ చిలికినా, నీ ప్లేస్ ఇంతకంటే బెటర్ అవదు. అయితే అదే గ్యారంటీ నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో' అంటూ హాస్యభరితంగా రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
'మై డియర్ బచ్చా' అంటూ చరణ్‌పై చిరు సెటైర్ - megastar latest news
తన కుమారుడు రామ్ చరణ్ ట్వీట్ చేసిన వెన్న చిలుకుతున్న వీడియోపై, మెగాస్టార్ చిరంజీవి తనదైన సెటైర్ వేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
రామ్ చరణ్ చిరంజీవి
ఇందులో భాగంగా హీరో రామ్‌చరణ్.. తన నానమ్మ అంజనాదేవీతో వెన్న చిలుకుతూ కనిపించాడు. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు చరణ్. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'లో ఓ హీరోగా నటిస్తున్నాడు. మరోవైపు మెగాస్టార్ 'ఆచార్య'లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్.. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది.