సమకాలీన అగ్రశ్రేణి హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ఎప్పుడు కలిసినా ప్రత్యేకమే. దశాబ్దాలుగా స్టార్ కథానాయకులుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసున్న ఓ ఫొటో ఇటీవలే వైరల్గా మారింది. 'సైరా' సన్మాన కార్యక్రమంలో దిగినదే ఈ ఫొటో అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.
ఇటీవలే హైదరాబాద్లోని పార్క్ హయత్ హొటల్లో ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ కుమార్తె దివ్య నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటే విచ్చేసిన చిరు, బాలయ్య.. ఆత్మీయంగా పలకరించుకుని అనేక విషయాలు చర్చించుకున్నారు. బాలకృష్ణ.. 'సైరా' విశేషాలు అడిగి తెలుసుకోగా, బాలయ్య చేస్తున్న కొత్త చిత్రం గురించి మెగాస్టార్ వాకబు చేశారు.